ఏపీలో ప్రారంభమైన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రారంభం

నెల్లూరు: ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏపీలో జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీలతోపాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఈ లెక్కింపు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, పది గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/