రాష్ట్రంలోని పలు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంచిర్యాల కమిషనర్‌గా పని చేస్తున్న స్వరూపారాణిని జగిత్యాలకు బదిలీ చేశారు. నిర్మల్‌లో పని చేస్తున్న బాలకృష్ణను మంచిర్యాలకు బదిలీ చేశారు. మహబూబాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ప్రసన్నరాణిని, వికారాబాద్‌ కమిషనర్‌గా శరత్‌ చంద్రను నియమించింది. మహబూబాబాద్‌, వికారాబాద్‌ కమిషనర్లు నరేందర్‌రెడ్డిని, బుచ్చయ్యను మున్సిపల్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/