అక్టోబర్‌ 4 నుంచి ముంబయిలో తెరుచుకోనున్నపాఠశాలలు

ముంబయి: అక్టోబర్‌ 4 నుంచి ముంబయిలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తొలుత 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. ‘అక్టోబర్ 4 నుండి ముంబయిలో 8 నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తున్నాం. మిగిలిన తరగతుల కోసం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం జారీ చేసిన అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలను అమలు చేస్తాం’ అని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు.

కాగా, మహారాష్ట్ర విద్యా మంత్రి వర్ష గైక్వాడ్ కూడా ఇటీవల ఇదే విషయం చెప్పారు. అక్టోబర్‌ 4 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5-12 తరగతులకు, అర్బన్‌ ప్రాంతాల్లో 8-12 తరగతులకు క్లాసులను పునరుద్ధరిస్తామని తెలిపారు. సంబంధిత ఏర్పాట్లు కోసం స్కూళ్లు, టీచర్లకు తగిన మార్గదర్శకాలు, నిబంధనలను జారీ చేసినట్లు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/