బెంగుళూరుపై ముంబయి ఇండియన్స్ గెలుపు…

ఐపిఎల్ 2019లో భాగంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి టజ్టులో రోహిత్ శర్మ (33బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48), సూర్యకుమార్ యాదవ్ (24బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38), హార్థిక్ పాండ్యా (14బంతుల్లో 2ఫోర్లు, మూడు సిక్సర్లతో 32), యువరాజ్ సింగ్ (12బంతుల్లో 3సిక్సర్లతో 23) చెలరేగడంతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 188 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టులో డివిలియర్స్్ (39బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్లతో 69)కు తోడు కోహ్లీ (32బంతుల్లో 6ఫోర్లతో 46), పార్థివ్ పటేల్ (22బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) చేయడంతో బెంగుళూరు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులే చేయగలిగింది.
ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ సాగిందిలా…
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆట ప్రారంభం నుంచి ఆచితూచి ఆడిన 6ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. అయితే, 6.3వబంతికి బెంగుళూరు స్పిన్ అస్త్రం పనిచేసింది. లెగ్ బ్రేక్ బౌలర్ చాహల్ వేసిన మూడో బంతిని రివర్ స్వీప్ చేయబోయిన డికాక్ (20బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23) ఔటయ్యాడు. ఆతర్వాత అర్థ శతకానికి చేరువయ్యే దశలో 10.4 వబంతికి రోహిత్ శర్మ (33బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత యువరాజ్, సూర్యకుమార్ దాటిగా ఆడారు. ఈక్రమంఓల 13.4వ బంతికి భారీషాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద యువరాజ్ (12బంతుల్లో మూడు సిక్సర్లతో 23) సిరాజ్‌కు చిక్కి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. చాహల్ వేసిన 15.3వబంతిని ఆడబోయిన సూర్యకుమార్ యాదవ్ (24బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38) అలీకి క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. ఆతర్వాత 15.6వ బంతికి పొలార్డ్ (5) హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి 5వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికీ ముంబయి జట్టు 16ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆతర్వాత కృనాల్ పాండ్యా వేసిన 16.3వ బంతికి కృనాల్ పాండ్యా (1) ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద నవ్‌దీప్ షైనీ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. సిరాజ్ వేసిన 17.1 వ బంతికి మెక్లెనగన్ (1) క్లీన్‌బౌల్డై 7 వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత సిరాజ్ వేసిన 19.1 వ బంతికి మార్కండె (6) కీపర్ పార్థివ్‌కు క్యాచ్ ఇచ్చి 8 వవికెట్గా వెనుదిరిగాడు. ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
బెంగుళూరు బ్యాటింగ్ సాగిందిలా….
188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు ఆరంభంలో ఆచితూచి ఆడింది. అయితే బుమ్రా వేసిన 3.2బంతిని పార్థివ్ ఆడాడు. వెంటనే త్వరిత పరుగుకు ప్రయత్నించాడు. అవతలి ఎండ్‌లోని అలీ క్రీజులోకి చేరేలోపే రోహిత్ శర్మ బంతిని వికెట్లకు విసిరాడు. దీంతో మొయిన్ అలీ (7బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 13) రనౌటయ్యాడు. ఆతర్వాత పార్థివ్, కోహ్లీ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో 6.5వబంతిని ఆడబోయిన పార్థివ్ (22బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) బౌల్డయ్యాడు. బ్యాట్‌కు తగిలిన బంతి వికెట్లను గిరాటేసింది. పార్థివ్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసే సరికి బెంగుళూరు 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. బెంగుళూరు సారథి విరాట్ కోహ్లీ (32బంతుల్లో 6ఫోర్లతో 46) ఐపిఎల్‌లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఆ వెంటనే బుమ్రా వేసిన 13.4వ బంతికి పాండ్యాకు క్చాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 16.1బంతికి హెట్మెయిర్ (5) హార్థిక్ క్యాచ్ ఇచ్చి 4వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో డివిలియర్స్ 31బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అర్థసెంచరీ తర్వాత డివిలియర్స్ జోరు పెంచాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బెంగుళూరు జట్టు 18 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 18.3 వబంతికి గ్రాండ్ హోమ్ (2) బుమ్రా బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. 19ఓవర్ బుమ్రా అద్భుతంగా విసరడంతో బెంగుళూరు 5 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా బెంగుళూరు 11 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ముంబయి బౌలర్లలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ, చాహల్, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ తీశారు.
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/sports/