ముంబయి ఇండియన్స్‌ విజయం…

పంజాబ్‌పై 3వికెట్ల తేడాతో గెలుపు….

Kieron Pollard mumbai indians won the match
Kieron Pollard, mumbai indians won the match

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుధవారం ముంబై ఇండియన్స్‌ 3వికెట్ల తేడాతో గెలుపొందింది. కష్టాల్లో ఉన్న ముంబయిని పొలార్డ్‌ (31బంతుల్లో 3ఫోర్లు, 10 సిక్సులతో 83) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముంబయిని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేసింది.కెఎల్‌ రాహుల్‌ సెంచరీకి జతగా, గేల్‌ అర్థ సెంచరీ సాధించడంతో కింగ్స్‌ పంజాబ్‌ భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకి శుభారంభం లభించింది. ఓపెనర్లు కెఎల్‌ రాహుల్‌ (64బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సులతో 100), క్రిస్‌ గేల్‌ (36బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సులతో 63) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ ధాటిగా ఆడి 116 పరుగులు జోడించారు. ఒకవైపు గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతే, రాహుల్‌ కుదురుగా బ్యాటింగ్‌ చేశాడు. గేల్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్‌ ఎవరన్నదీ చూడకుండా విరుచుకుపడ్డారు.అయితే గేల్‌ (36బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సులతో 63)తో 13వ ఓవర్‌లో క్రిస్‌గేల్‌ ఔటయ్యాడు. ఆతర్వాత పంజాబ్‌ కాస్త తడబడి వరుసగా వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ మిల్లర్‌ (7), కరుణ్‌ నాయర్‌ (5), కరన్‌ (8)లు స్వల్పవ్యవధిలోనే పెవిలియన్‌ చేరారు. అయినప్పటికీ రాహుల్‌ మాత్రం కడవరకు క్రీజులో ఉన్నాడు. హార్థిక్‌ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఫోర్‌ కొట్టి తన పవర్‌ గేమ్‌ను చూపించాడు. జట్టుకు శతకంతో చెలరేగి భారీ స్కోరు అందించాడు.ఓవరాల్‌గా 64బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్థిక్‌కు రెండు వికెట్లు లభించగా..బెహ్రాన్‌డార్ఫ్‌, బుమ్రాలకు తలో వికెట్‌ దక్కింది.198పరుగుల భారీ విజయ లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్‌చేసిన ముంబయి జట్టులో ఓపెనర్‌ సిద్ధేశ్‌ లాడ్‌ (24) అశ్విన్‌ బౌలింగ్‌లో తొలివికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (21) సామ కరన్‌ బౌలింగ్‌లో, డికాక్‌ (24) అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లకు ముంబయి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.వెంటవెంటనే మూడు వికెట్లు పడటంతో ముంబయి కష్టాల్లో పడింది. ఆతర్వాత ఇషాన్‌ కిషన్‌ (7) సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో రనౌట్‌గా నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.ఆతర్వాత 15.1వ బంతికి హార్థిక్‌ పాండ్యా (19), ఆతర్వాత మూడు బంతుల వ్యవధిలో కృనాల్‌ పాండ్యా (1) షమీ బౌలింగ్‌లో వీరిద్దరూ మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ఒంటరి పోరాటం చేసి విధ్వంసకర ఇన్నింగ్స్‌్‌ ఆడిన పొలార్డ్‌ (31బంతుల్లో 3ఫోర్లు, 10 సిక్సులతో 83) చివరి ఓవర్‌లో రాజ్‌పూత్‌ బౌలింగ్‌లో 7వికెట్‌గా వెనుదిరిగాడు.ఆతర్వాత జోసెఫ్‌ (15),చాహర్‌ (1) చేయడంతో 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లలో షమీ 3వికెట్లు, అశ్విన్‌, సామ్‌ కరాన్‌ చెరో వికెట్‌తీశారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/