బేబి బౌలర్‌ టు వరల్డ్‌ బీటర్‌

Jasprit Bumrah
Jasprit Bumrah

హైదరాబాద్‌: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తన ముందు ఓ బేబి బౌలర్‌ అంటూ పాకిస్థాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ చేసిన వ్యాఖ్యలకు రజాక్‌ సోషల్‌ మీడియాలో నవ్వుల పాలయ్యాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు అబ్దుల్‌ రజాక్‌ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. రజాక్‌ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు జోక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అని, రజాక్‌ ప్రపంచంలోనే అత్యంత భయంకర బౌలరని విమర్శలు చేశారు. రజాక్‌ వ్యాఖ్యలపై ముంబై  ఇండియన్‌ ప్రాంచైజీ తన ట్విట్టర్‌లో కాస్తంత ఫన్నీగా స్పందించింది. శుక్రవారం 26వ పుట్టిన రోజు జరుపుకుంటున్న జస్ప్రీత్‌ బుమ్రాకు ముంబై ఇండియన్స్‌ బేబి బౌలర్‌ టు వరల్డ్‌ బీటర్‌ అంటూ బుమ్రా యువకుడిగా ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/