గార్లిక్‌ పుడ్‌ ఫెస్టివల్‌లో కాల్పులు…ముగ్గురు మృతి

దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు

US food festival
US food festival

కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలోని గిల్‌రాయ్‌ లో జరుగుతున్న గార్లిక్‌ పుడ్‌ ఫెస్టివల్‌లో ఆదివారం 30 ఏళ్ల వయసున్న ఓ శ్వేతజాతీయుడు హఠాత్తుగా వేడుకల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దుండగుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్‌ దుండగుడు ఇంకా పరారీలో ఉన్నాడని స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ గార్లిక్‌ ఫెస్టివల్‌ని అమెరికాలోనే అతిపెద్ద ఫుడ్‌ ఫెస్టివల్‌గా చెబుతుంటారు. అయితే ఫుడ్‌ ఫెస్టివల్‌ వేడుకల్లోకి దుండగుడు ప్రవేశించి కాల్పులు ప్రారంభించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/