ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తి

ములాయం సింగ్ యాదవ్ అంతక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తీ అయ్యాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయంసింగ్‌ యాదవ్‌.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న హాస్పటల్ లో చేరిన ఆయన.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూశారు. ఈయన మృతి పట్ల యావత్ రాజకీయ పార్టీ నేతలు సంతాపం తెలియజేసారు.

మంగళవారం ములాయం సింగ్ యాదవ్ అంతక్రియలు ఇటావా జిల్లాలోని సైఫైలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అఖిలేష్ యాదవ్.. తండ్రి ములాయం సింగ్ యాదవ్ చితికి నిప్పంటించారు. తమ ప్రియతమ నాయకుడిని కడసారిగా చూసుకునేందుకు యూపీ ప్రజలు అక్కడకు వెళ్లారు. ఎస్పీ పార్టీ కార్యకర్తలు, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు సైతం అక్కడకు వెళ్లి.. నివాళులు అర్పించారు. ములాయం అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతాజీ అమర్ రహే అంటూమ నినాదాలు చేశారు. ఇక ఈ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎంపీ జయాబచ్చన్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ , టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.