నామినేషన్‌ దాఖలు చేసిన ములాయం సింగ్‌ యాదవ్‌

Mulayam Singh Yadav
Mulayam Singh Yadav

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ తన తనయుడు అఖిలేష్‌తో కలిసి ఈరోజు మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతు తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు. ఎస్పీబీఎస్పీ కూటమి తరఫున ఎవరు ప్రధాని అభ్యర్థి అని ప్రశ్నించగా.. అది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఈ ఎన్నికల్లో ములాయం గెలుస్తారని ఈ సందర్భంగా అఖిలేష్ స్పష్టం చేశారు. మెయిన్‌పురిలో కాంగ్రెస్‌తోపాటు ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిషీల్ సమాజ్‌వాదీ పార్టీలోహియా కూడా తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/