పెద్దపల్లిలో ముకుందరెడ్డి విగ్రహావిష్కరణ
హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్

మాజీ ఎమ్మెల్యే దివంగత గీట్ల ముకుంద రెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో గిట్ల విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బిరుదు రాజమల్లు, కటకం మృత్యుంజయం, ఈద శంకర్ రెడ్డి, వేముల రామ్మూర్తి, గీట్ల సవితా రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, జెడ్ పి టి సి లు గంట రాములు, తిరుపతి రెడ్డి, బండారి రామ్మూర్తి పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/