మరోసారి అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ముకుల్ రోహ‌త్గీ

Mukul Rohatgi set to become Attorney General again

న్యూఢిల్లీః సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌(ఏజీ)గా బాధ్యలు స్వీకరించే అవకాశం ఉందని ప్ర‌భుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 201లో 67 ఏళ్ల రోహ‌త్గీ అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత కేకే వేణుగోపాల్ ఆ బాధ్య‌త‌ల్ని తీసుకున్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీన వేణుగోపాల్ ప‌ద‌వీ కాలం ముగియ‌నున్నారు. అయిదేళ్ల పాటు కేంద్ర ప్ర‌భుత్వ టాప్ లాయ‌ర్‌గా వేణుగోపాల్ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వేణుగోపాల్ వ‌య‌సు 91 ఏళ్లు. అయితే వ‌య‌సు రీత్యా త‌న‌కు విర‌మ‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న గ‌తంలో కోరారు. ఇక అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ముఖుల్ రోహ‌త్గీ అటార్నీ జ‌న‌ర‌ల్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తారు. గ‌తంలో అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయ‌న చేశారు. 2017లో రోహ‌త్గీ ఆఫీసు నుంచి వెళ్లినా.. అనేక సున్నిత‌మైన అంశాల్లో ప్ర‌భుత్వం ఆయ‌న్ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/