పాక్‌కు వెళ్లిపోండి అని గద్దించిన ఎస్పి
చర్యలకు కేంద్రమంత్రి డిమాండ్

మీరట్: పౌరసత్వ చట్టం నేపథ్యంలో నిరసనలు చేపట్టిన ఇద్దరు ముస్లింలను ఉద్దేశించి, మతాన్ని ప్రస్తావిస్తూ ఓ ఎస్పి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి పాక్ కు వెళ్లిపోండి అని మీరట్ ఎస్పి అఖిలేశ్ నారాయణ్ సింగ్ గద్దించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కాగా దీనిపై స్పందిచిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ.. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. హింస ఏ స్థాయిలో ఉన్నా ఉన్నతాధికారి హోదా కల్గిన వ్యక్తి ఇలా ప్రవర్తించకూడదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సంహిచేది లేదని, అమాయక ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని అన్నారు. అటువంటి వారే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి అన్నారు. ఎస్పి నారాయణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన డిమాండ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/