మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత

Mukesh Goud
Mukesh Goud

హైదరాబాద్‌: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌గౌడ్‌ (60) కన్నుమూశారు. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా ఈరోజు తుది శ్వాస విడిచారు.ముఖేశ్‌ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముఖేశ్‌ గౌడ్‌ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 1989, 2004లో మహారాజ్‌గంజ్‌, 2009లో గోషామహల్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2009లో మరోసారి మార్కెటింగ్‌ శాఖ బాధ్యతలను అయిదేళ్లపాటు నిర్వర్తించారు. 2014, 2018లలో గోషామహల్‌ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ చేతిలో ఓడిపోయారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/