ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరిన ముఖేష్ అంబానీ

నిన్నటి వరకు ఆసియలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలోకి చేరి మరో ఘనత సాధించారు. ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క రోజులోనే(సెప్టెంబర్ 3) 3.71 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంపద ఇంతభారీగా పెరగడానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర పెరగడమేనని తెలుస్తోంది. దీంతో ముఖేష్ అంబానీ.. ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు.

బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ తన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ఆర్ఐఎల్ షేర్లు సోమవారం(సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద ఉన్నాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇక ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ 103 బిలియన్‌ డాలర్లతో 10వ స్థానంలో నిలవగా.. 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు బెటెన్‌కోర్ట్ మేయరన్‌ ఉన్నారు. ఇప్పుడు 12వ స్థానంలో అంబానీ ఉన్నారు.

ఇక టాప్ సంపన్నుల జాబితా ఓ లుక్ వేస్తే..

  1. జెఫ్ బెజోస్ – 200.7 డాలర్లు
  2. ఎలన్ మస్క్ 198.9 డాలర్లు
  3. బెర్నార్డ్ అర్నాల్ట్ 163.6 డాలర్లు
  4. బిల్ గేట్స్ 153.6 డాలర్లు
  5. మార్క్ జుకర్ బర్గ్ 139.8 డాలర్లు
  6. ల్యారీ పేజ్ 128.1 డాలర్లు
  7. సెర్గే బ్రిన్ 123.6 డాలర్లు
  8. స్టీవ్ బాల్ మర్ 107.6 డాలర్లు
  9. ల్యారీ ఎలిసన్ 103.8 డాలర్లు
  10. వారెన్ బఫెట్ 102.6 డాలర్లు
  11. ఫ్రాకోయిస్ బెటెన్ కౌంట మేయర్స్-92.9 డాలర్లు
  12. ముఖేష్ అంబానీ -92.6 డాలర్లు