ముఖేష్‌ అంబానీ సంపాదన ఎంతో తెలుసా?

Mukesh Ambani
Mukesh Ambani

ముంబయి: భారత అపర కుబేరుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సంపద 2019లో అక్షరాలా 17 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.2 లక్షల కోట్లు. దీంతో ఈ నెల 23వ తేదీ నాటికి అంబానీ మొత్తం సంపద 61 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.4.3లక్షల కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీయర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా సంపద ఈ ఏడాది 11.3 బిలియన్‌ డాలర్లు పెరగగా..ఆమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోన్‌ 13.2 బిలియన్‌ డాలర్లు కోల్పోవడం గమనార్హం. మూదేళ్ల క్రితం రిలయన్స్‌ తీసుకొచ్చిన జియో..అనతికాలంలోనే భారత్‌లో అగ్రగామి టెలికాం ఆపరేటర్‌గా ఎదిగింది. ఈ విజయం కంపెనీకి ఉత్పాహాన్నిచ్చింది. దీంతోపాటు రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారు. 2021 ఆరంభం నాటికి రిలయన్స్‌ గ్రూప్‌ సున్నా రుణాలతో ఉండేలా చూస్తామని ఆ మధ్య ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/