సీఎం రేవంత్ కు బక్రీద్ విందు ఇచ్చిన ముజాహిద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం బక్రీద్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులకు అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ బక్రీద్ విందు ఇచ్చారు.

బక్రీద్ పర్వదినం సందర్భంగా ముజాహిద్ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, తదితరులు ముజాహిద్ ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముజాహిద్ కుటుంబ సభ్యులతోపాటు ప్రజలకు ముఖ్యమంత్రి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

CM @revanth_anumula celebrated #Bakrid today at the residence of Anwarul Uloom Educational Society secretary Nawab Mujahid Alam Khan in #Hyderabad
Speaker G Prasad Kumar, Ex minister Jana Reddy, Govt Advisor Shabbir Ali, MLA Jayaveer Reddy, DCC president Rohin Reddy were present pic.twitter.com/63fYBp19Ez— L Venkat Ram Reddy (@LVReddy73) June 17, 2024