ప్రధానికి ముద్రగడ పద్మనాభం లేఖ

  • ఆ బిల్లు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉంది
Padmanabham- pm modi
Padmanabham- pm modi

అమరాతి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని మోడికి లేఖ రాశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017 డిసెంబర్ 2వ తేదీన కాపు రిజర్వేషన్ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించిందని… ఆ తర్వాత కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని మోదీని ముద్రగడ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు గత 50 ఏళ్లుగా కాపు ఓట్లను పొందాయని… కానీ రిజర్వేషన్లను కల్పించడంలో మాత్రం తమను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. తక్షణమే బిల్లును ఆమోదించాలని… కాపు రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.


తాజా ఆద్యాత్మిక వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/