ఆందోళనను తగ్గించే ‘ముద్ర’..

వ్యాయామం – ఆరోగ్యం

mudra reducing Anxiety
mudra.. reducing Anxiety

మనమంతా ఇంటిపని, బయటి పనులతో అలసి పోతుంటాం…ఆ పని ఒత్తిడి ఒక్కోసారి ఆందోళనకు దారి తీస్తుంది.. దాన్ని అధికమించటానికి ఏవో వ్యాపకాలు పెట్టుకుంటాం… అంతకంటే ముందు ‘వజ్ర పద్మ ముద్ర’ ప్రయత్నించి చూడండి… అలసట, ఆందోళన నుంచి బయట పడవచ్చు.. పనిభారం పెరిగి లేదా, మరేదైనా కారణంతో ఒత్తిడిగా అనిపించినపుడు ఈ ముద్రలో కూర్చుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది..

ఎలా చేయాలంటే..?

మీ రెండు చేతుల అన్ని వేళ్ళను ఒకదానితో ఒకటి కలిపి బొటనవేలును కూడా దగ్గరగా పెట్టుకోవాలి… ఛాతీ భాగానికి అంటించకుండా కొద్ది దూరానుంచాలి. కింద కూర్చోలేనివారు కుర్చీలో కూడా చేయవచ్చు.. కళ్ళు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుంటూ , వదులుతూ ‘ ఓం వజ్ర పద్మేహూ’ అనుకుంటూ చేయాలి… రోజుకు 5 నిముషాల చొప్పున మూడు పూటలా చేయండి.

స్వస్థ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/