సెలక్షన్‌ కమిటీకి కొత్త చైర్మన్‌

స్పందిచిన సౌరవ్‌ గంగూలీ

Sourav Ganguly
Sourav Ganguly

ముంబరయి: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సెలక్షన్‌ కమిటీలో కీలక మార్పులు చేయనున్నారు. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్‌ఎస్‌కె ప్రసాద్‌ స్థానంలో మరో కొత్త చైర్మన్‌ను పెట్టనున్నారని తెలుస్తోంది. కాగా ఈ విషయంపై గంగూలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న జతిన్‌ పరాంజ్పే, శరణ్‌ దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీ వారి వారి స్థానాల్లోనే కొనసాగనున్నారు. అయితే వారి గడువు ఇంకో సంవత్సరం మాత్రమే ఉందని, అప్పటి వరకూ వారు తమ పదవుల్లో కొనసాగుతారని అన్నారు. ఇకపోతే చైర్మన్‌ గా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఎమ్‌ఎస్‌కె ప్రసాద్‌, కమిటీలో సభ్యుడిగా ఉన్న గగన్‌ ఖోడాల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేస్తామని గంగూలీ తెలిపారు. మొదటగా కొత్త సిఏసి నియామకం జరగాలని, ఆ తర్వాత సెలక్షన్‌ కమిటీపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. అయితే క్రికెట్‌ సలహా మండలి ఆదేశాల మేరకు మాత్రమే ఈ నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు గంగూలీ.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/