ఓటుకు నోటు కేసు : తెరాస ఎమ్మెల్యే కు , రేవంత్ కు సమన్లు

ఓటుకు నోటు కేసు : తెరాస ఎమ్మెల్యే కు , రేవంత్ కు సమన్లు

తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా తెలుగుదేశం నేత చంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటె తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు… ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి అలాగే తెరాస లో చేరిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు హాజరు కావాలని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టు సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేయడం జరిగింది.