ధోనీ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ

ముంబయి: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్‌పై నిర్ణయాలను ఇప్పుడే చెప్పలేం అని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ధోనీ టీమిండియాకు అద్భుతమైన ఆటగాడు, అలాంటి వ్యక్తి భవితవ్యంపై నిర్ణయాలు రహస్యంగానే ఉంటాయి. అవి ఎంతో పారదర్శకంగా కూడా ఉంటాయి. ధోనీ భవితవ్యంపై పూర్తి స్పష్టత ఉంది, కానీ ఆ విషయాలను ఇప్పుడే వెల్లడించం. బోర్డుకు, ధోనీకు, సెలెక్టర్లకు మధ్య ఎంతో స్పష్టత ఉంది. అది భవిష్యత్తులో మీకే తెలుస్తుంది అని గంగూలీ అన్నారు. ఇటీవల టీమిండియా కోచ్ రవిశాస్త్రి ధోనీ వచ్చే ఐపిఎల్‌లో ఎలా ఆడతాగనేదానిపై అతడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా మరోపక్క 2020 ఐపిఎల్ తర్వాతే ధోనీ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడని అతడి సన్నిహిత వర్గాలు చెప్పిన విషయం కూడా తెలిసిందే. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో అతడు వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యారు. ఆ తర్వాత నుంచి ధోనీ ఇప్పటివరకు ఏ మ్యాచ్‌లోనూ కనపడలేదు. అయితే తాజాగా ధోనీ గత కొన్ని రోజులనుంచి మైదానంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఎంతో కఠోర సాధన చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/