ధోని రిటైర్మెంట్‌ గురించి రైనా స్పందన

raina, dhoni
raina, dhoni

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని టీమ్‌లో ఎంత కాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతాడు. అతని రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి సమాచారం లేదని చెన్నై వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌రైనా తెలిపారు. ఐపిఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోని చెరగని ముద్ర వేశాడు. ఐపిఎల్‌కు ధోని మూడు ట్రోఫీలందించాడు.
ధోని రిటైర్మెంట్‌ గురించి వచ్చిన వార్తలపై రైనా స్పందిస్తూ ..ధోని రిటైర్మెంట్‌కు ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. అతను ఒక గొప్ప ఆటగాడు, కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌కీపర్‌గా ధోని సేవలు అద్భుతం అని రైనా పేర్కొన్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/