సైన్యం విధుల్లో చేరునున్న ఎంఎస్‌ ధోని!

M.S. Dhoni
M.S. Dhoni

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశ రక్షణకు అహర్నిశలూ శ్రమించే సైన్యం విధుల్లో తానూ భాగం కావాలని నిర్ణయించుకున్నాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ పారా మిలటరీ సైనికుడిగా జులై 31 నుంచి ఆగస్ట్ 15వరకూ సేవలందించనున్నాడు. కశ్మీర్‌ వ్యాలీలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోనీ విధులు నిర్వహించనున్నాడు. 2011లో ధోనీ టీమిండియాకు అందించిన సేవలకు గానూ భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ధోనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సైనిక ఉన్నతాధికారులు అభినందించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/