జార్ఖండ్‌లో ధోనీ ప్రత్యేక పూజలు

రీ ఎంట్రీ ఫలించేనా?

MS Dhoni offers prayers in deori temple
MS Dhoni offers prayers in deori temple

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ జార్ఖండ్‌లోని ప్రసిద్ధ దేవాలయం డియోరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ పూజలు ఐపిఎల్‌ కోసమే మొదలెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. బిసిసిఐ తన కాంట్రాక్టు నుంచి ధోనీ మినహాయించడంతో అందరూ ధోనీ కెరీర్‌ ఇక ముగిసినట్లే అనుకున్నారు. అయితే ఇటీవలే టీమిండియా కోచ్‌ రవి శాస్త్రి ఐపిఎల్‌లో ధోనీ రాణిస్తే.. ప్రపంచకప్‌ కోసం ఎంపికని పరిశీలిస్తామని అన్న విషయం తెలిసిందే. దీంతో ధోనీ అభిమానులు కాస్త గాలి పీల్చుకున్నారు. గతంలో ధోనీ 2011 వన్డే ప్రపంచకప్‌ ముందు కూడా డియోరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే మళ్లీ ఇప్పుడు మరోసారి ధోనీ అదే దేవాలయంలో పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క ధోనీ కెరీర్‌లో ఐపిఎల్‌ అతడి భవిష్యత్తును తేల్చనుంది. చూడాలి మరి ఈ మిస్టర్‌ కూల్‌ ఏంచేస్తాడో.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/