సింగర్‌ అవతారం ఎత్తిన ధోనీ

MS Dhoni
MS Dhoni

జార్ఖండ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన ఓ కార్యక్రమంలో స్నేహితులతో కలిసి ఆడిపాడారు ధోనీ. దీంతో తనలో మరో ప్రతిభ కలిగి ఉందని మిస్టర్‌ కూల్‌ నిరూపించారు. ప్రపంచకప్‌ 2019 సెమీస్‌ అనంతరం ధోనీ తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పూర్తి సమయాన్ని ధోనీ తన కుటుంబంతోనే గడుపుతున్నారు. ముఖ్యంగా తన కూతురు జీవాతో కలసి ఆయన సందడి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ తన స్నేహితుడితో కలిసి జుర్మ్‌ అనే బాలివుడ్‌ చిత్రంలోని జబ్‌ కోయ్‌ బాత్‌ బిగాద్‌ జయా అనే పాటను మహీ పాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ధోనీ స్నేహితురాలు, టెలివిజన్‌ నటి ప్రీత్‌ సిమోస్‌ ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌ చేస్తున్నా నన్ను చంపకు అంటూ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/