రిటైర్మెంట్‌పై పెదవి విప్పిన ధోని

M S Dhoni
M S Dhoni


లీడ్స్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన రిటైర్మెంట్‌ గురించి వస్తున్న విమర్శలపై నోరువిప్పారు. క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో తనకు తెలీదని ,కాని అందరు శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే తాను రిటైర్‌ కావాలని కోరుకుంటున్నారని ధోని ఏబిపి మీడియాతో అన్నాడు. ఐతే ఈ విషయంలో టీమిండియా ఆటగాళ్లను కానీ, జట్టు యాజమాన్యాన్ని కాని తాను నిందించడం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో కాని, బౌలింగ్‌లో కాని ఆశించని విధంగా ప్రదర్శన చేయడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/