డింపుల్‌ యాదవ్‌ సమక్షంలో ఎస్పిలోకి పూనమ్‌ సిన్హా

dimple yadav, poonam sinha, Shatrughan sinha
dimple yadav, poonam sinha, Shatrughan sinha


ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శతృఘ్నసిన్హా..ఇటీవలే బిజెపిని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో శతృఘ్నసిన్హా భార్య పూనమ్‌ సిన్హా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్పి అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ సమక్షంలో పూనమ్‌ సిన్హా ఎస్పి తీర్ధం పుచ్చుకున్నారు. ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు డింపుల్‌ యాదవ్‌. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌పై ఎస్పి-బిఎస్పీ కూటమి అభ్యర్థిగా పూనమ్‌ సిన్హా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి రాజ్‌నాథ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. శతృఘ్నసిన్హా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై పాట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/