రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

మాస్‌ మహారాజా రవితేజ – భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ మిస్టర్ బచ్చన్. రీసెంట్ గా సితార్‌ ఫుల్ లిరికల్ ప్రోమో ఆకట్టుకోగా..ఈరోజు ఫుల్ సాంగ్ వచ్చి చిత్రంలోని పాటలపై ఆసక్తి పెంచింది. బాలీవుడ్ సూపర్ హిట్ రైడ్ కి రీమేక్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు.

ఇటీవల సితార్ సాంగ్ ప్రోమో విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక నేడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. గేయ రచయిత సాహితి అంధించిన లిరిక్స్ కు మిక్కీ జేఏసీ మేయర్ మ్యూజిక్ అలాగే సాకేత్, సమీరా గానం పర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి. ఈ పాటను వింటుంటే చాలా రోజుల తరువాత ఒక పూర్తి తెలుగు పాటను విన్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ మధ్యలో ఉన్న కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది. రొమాంటిక్ మెలోడీ లో వారు వేసిన స్టెప్పులు మ్యూజిక్ కు తగ్గట్టుగా ఉన్నాయి. హరీష్ శంకర్ తన ప్రత్యేక శైలిలో పాటను ఫైనలైజ్ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక సితార్ సాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోయే మెలోడీగా నిలుస్తుందనే ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.

YouTube video