ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌ ప్రారంభం

mptc zptc votes counting
mptc zptc votes counting

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా మూడు విడుతలుగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌటింగ్‌ ఉదయం 8 గంటకే ప్రారంభమైంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీటీసీ, 2 గంటల వరకు జడ్పీటీసీల కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్‌ ప్రక్రియను సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేసి, 6 గంటల్లోగా స్ట్రాంగ్‌ రూముల్లోకి బ్యాలెట్‌ బాక్సులను తరలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నెల 7న మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 8వ తేదీన జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు పూర్తిచేసేందుకు వీలుగా ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించింది. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/