ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు : బాబు నియోజకవర్గంలో వైసీపీ హావ

ఏపీలో మరోసారి వైసీపీ కి తిరుగులేదని ఓటర్లు నిరూపించారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ లెక్కింపులో వైసీపీ దూకుడు కనపరుస్తుంది. గుంటూరు జిల్లా మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అలాగే విజయనగరం లోను వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది.

సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 25 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు విడుదలయ్యాయి. వైసిపి 25. టీడీపీ 01. వైసీపీ రెబల్స్ 02 సాధించారు. పశ్చిమ గోదావరిలోను వైసీపీ జోరు కనిపిస్తుంది. కుప్పంలో వైసీపీ హవానే కనిపిస్తుంది. నియోజకవర్గంలో మొత్తం 66 స్థానాలు ఉండగా.. 65 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు.. వైసీపీ..18 గెలుపొందగా.. టీడీపీ..03 విజయం సాధించింది.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో నోటీఫికేష‌న్ విడుద‌ల కాగా.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7220 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక‌ల్లో 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మరికాసేపట్లో వారి భ‌విత్వం తేల‌నున్న‌ది.