పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ జోరు

trs
trs

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లేక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4,216 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలవడ్డాయి. అయితే ఈ ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ ముందంజలో కొనసాగుతుంది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. మధ్యాహ్నం వరకు వెల్లడైనా ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థులు 2660 స్థానాల్లో, కాంగ్రెస్‌ 912 స్థానాల్లో, బిజెపి 172 స్థానాల్లో, టిడిపి 18 స్థానాల్లో, వామపక్షలు 44 స్థానాల్లో, ఇతరులు 401 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాదించారు. కాగా ఇప్పటి వరకు 5,659 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యహ్నం తర్వాత జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/