నేటి నుండి మూడో విడుత నామినేషన్లు

ZPTC, MPTC Election nominations
ZPTC, MPTC Election nominations

హైదరాబాద్‌: రాష్ట్రంలోని జెడ్పీటీసీల మూడో విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం కానున్నది. మూడోవిడుతలో 31 జిల్లాల పరిధిలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 2వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జెడ్పీటీసీలకు మండలకేంద్రాల్లో.. ఎంపీటీసీ స్థానాలకు ప్రతి మూడు ఎంపీటీసీలకు ఒక గ్రామాన్ని రిటర్నింగ్ అధికారులకు కేటాయించి నామినేషన్లు తీసుకోనున్నారు. మే 6న అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. మూడోవిడుత పోలింగ్ 14వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మూడోవిడుత ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ ఇచ్చి.. ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటరు జాబితాను విడుదలచేసి నామినేషన్లు స్వీకరిస్తారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/