కేసీఆర్ తన కూతుర్ని రాజ్యసభకు పంపబోతున్నారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవితను రాజ్యసభ కు పంపబోతున్నారా..అందుకే ఆయన బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారా..ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ సాగుతుంది. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. వీరిలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ఒకరు. ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా.. తెలంగాణ కేబినెట్లోకి ప్రకాష్ ను తీసుకొనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక బండ ప్రకాష్ రాజ్యసభ స్థానం లో.. తన కూతురు కల్వకుంట్ల కవిత ను రాజ్యసభ కు పంపేందుకు కేసీఆర్ చూస్తున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అంటున్నారు. జనవరి 4 వ తేదీన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి ముగియ నుంది. ఆ తర్వాత రాజ్యసభకు కవిత వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కవిత సైతం ముందు నుండి ఎమ్మెల్సీ పదవి ఫై పెద్దగా ఇంట్రస్ట్ గా లేదు. అందుకే రాజ్యసభ స్థానం ఫై ఆమె మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.