యురేనియం తవ్వకాలపై స్పందించిన రేవంత్‌

యురేనియం తవ్వితే గుండెల్లో గునపం దింపుతాం

Revanth Reddy
Revanth Reddy

ఆమ్రాబాద్‌: మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నల్లమలలో యురేనియం అన్వేషణ అనుమతుల నేపథ్యంలో ఈరోజు నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ. నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తవ్వకాలకు సహకరిస్తున్న టిఆర్‌ఎస్‌, బిజెపి నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలని సూచించారు. యురేనియం తవ్వకాలు జరగడంలేదంటూ సిఎం కెసిఆర్‌ హామీ ఇవ్వాలని, హామీ ఇచ్చేంతవరకు పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. నల్లమల అడవి బిడ్డలను తాను అండగా నిలుస్తానని, నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని రేవంత్ హెచ్చరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/