‘ఓటుకు నోటు’- రేవంత్ కు ఊరట
తెలంగాణ ఏసీబీకి ‘సుప్రీం’నోటీసులు జారీ

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా , ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేవంత్ అభ్యర్థన మేరకు కేసు విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/