హైకోర్టును ఆశ్రయించిన రఘురామ కృష్ణరాజు
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్న నరసాపురం ఎంపి

అమరావతి: వైఎస్ఆర్సిపి ఎంపి రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తనకు వైఎస్ఆర్సిపి లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామ కృష్ణరాజు కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని.. వైఎస్ఆర్సిపి షోకాజ్ నోటీసు ఇచ్చారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/