తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్​

సీఎం జగన్ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​ ను వేరే కోర్టుకు బదలాయించండి:రఘురామ

హైదరాబాద్: సీఎం జగన్, వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతుండగానే పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. వారి బెయిల్ రద్దు పిటిషన్ ను మరో కోర్టుకు బదలాయించాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కారు.

జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ విచారణను ఇటీవలే పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. రేపు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీబీఐ కోర్టు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని ఆయన కోరారు. పిటిషన్ ను అత్యవసర విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఆ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు ఆమోదం తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/