28 వరకు రిమాండ్ : ముందుగా ఆసుపత్రిలో చికిత్స

రఘురామ గాయాలపై నివేదిక కోరిన కోర్టు

MP Raghurama krishna raju
MP Raghurama krishna raju

Amaravati: ఎంపీ రఘురామ కు సి ఐ డి కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. అయితే ఎంపీ ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని ఆదేశించింది. ఎంపీ కోలుకునే దాకా ఆసుపత్రిలోనే ఉంచవచ్చని తెలిపింది. ఎంపీకి కేంద్రం కల్పించిన వై కేటగిరీ భద్రత కొనసాగించేందుకు సిఐడి కోర్టు అనుమతి ఇచ్చింది. రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. తొలుత జీజీహెచ్ లో, ఆపై రమేష్ ఆసుపత్రిలో మెడికల్ ఎగ్జామినేషన్ చేపట్టాలని నిర్దేశించింది. న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, తర్వాత రమేష్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తారని తెలిపారు. అయితే రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆయనను జైలుకు తలలించరని న్యాయవాది పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/