ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌తో మాకు సంబంధం లేదు – వైఎస్సార్‌సీపీ ఎంపీ క్లారిటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే CID అధికారులు పలు రాష్ట్రాల్లో పలువురు నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై దాడులు జరిపారు. కాగా ఈ స్కామ్ లో పలువురి రాజకీయ నేతల పేర్లు కూడా వినిపిస్తుండడంతో వారంతా స్పందిస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ స్కామ్ తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కాంతో తన కుటుంబానికి సంబంధం లేదని… మా బంధువర్గం చేసే వ్యాపారాల్లో కూడా మాగుంట అనే పేరు ఉండటం వల్ల మాపై ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో డైరెక్టర్లుగా లేమని.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. ఢిల్లీలోని 32 జోన్లలో తమ బంధువులకు 2 జోన్లలో మద్యం వ్యాపారాలున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఈడీ సోదాల్లో అనుమానాలను నివృత్తి చేశామన్నారు.

తాము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నామని.. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము అసలు లేమని క్లారిటీ ఇచ్చారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో తమకు వ్యాపారాలు ఉన్నాయని.. ఎక్కడ మచ్చలేని వ్యాపారం చేస్తున్నామన్నారు. తమ చెన్నె ,ఢిల్లీ నివాసాల్లో ఈడీ దాడులు జరిగాయని.. ఏ విధమైన ఆధారాలు, అక్రమాలు జరగలేదని ఈడి అధికారులు తేల్చారని.. పంచనామాలో కూడా ఇదే రాశారన్నారు.