ఫార్మా సిటీకి అనుమతులు రద్దు చేయండి

పేద రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు

komatireddy venkat reddy
komatireddy venkat reddy

న్యూఢిల్లీ: ఫార్మా సిటీ భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన కోమటిరెడ్డి నిబంధలనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మా సిటీకి అనుమతులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని గోయల్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వద్ద రూ.8 లక్షలకు కొనుగోలు చేసి రూ. కోటిన్నరకు విక్రయిస్తున్నట్లు కోమటిరెడ్డి ఆరోపించారు. స్థిరాస్థి వ్యాపారం కోసమే తెలంగాణలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. ఫార్మా కంపెనీలతో చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/