ఆ పదవికి నేను అర్హుడిని కాను

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు లోక్సభలో పార్టీ ఉపనేతగా, విప్ పదవికి ఎంపి కేశినేని నాని నియమించారు. అయితే ఈ పదవికి తాను సరిపోనని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతు లేఖ రాశారు. కాగా తనకంటే సమర్థుడైన మరో వ్యక్తిని విప్ పదవికి ఎంపికి చేయాలని కేశినేని లేఖలో కోరారు. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నా విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. వారి ఆశీస్సులు నాకున్నాయి. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుంది అని పేర్కొన్నారు. మరోసారి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెప్పారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/