ఓటేసిన ఎంపి కవిత దంపతలు

kavitha with husband
kavitha with husband

నిజామాబాద్‌: టిఆర్‌ఎస్‌ ఎంపి కవిత దంపతులు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందన్నారు. కావునా పట్టణ ఓటర్లు తప్పకుండా ఓటేయాలని కోరుతున్నట్లు ఆమె చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేస్తామన్నదానికన్నా ముఖ్యంగా ఓటు వేయడం అన్నది ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ దయచేసి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/