‘ఆకాశమే నీ హద్దురా’ నుంచి సాంగ్ ప్రోమో విడుదల

akashame-nee-haddura-movie

హైదరాబాద్‌: హిరో సూర్య సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతూ ఉంటాయి. సుధా కొంగర దర్శకత్వంలో ఆయన తాజా చిత్రంగా తమిళంలో ‘సూరరై పొట్రు’ రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘పిల్లా పులి ..’ అంటూ ఈ పాట మొదలవుతోంది. ‘ఎరవేశావే సంకురాతిరి సోకుల సంపదని .. నరికేశావే నా రాతిరి నిద్దరని’ అంటూ సాగుతోంది. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా అపర్ణ బాలమురళి అలరించనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/