ఐరన్‌ఓర్‌ సరఫరాకై ఎన్‌ఎండీసీ, ఏపీ సర్కారు మధ్య ఒప్పందం

kadapa-steel-plant-agreement-nmdc
kadapa-steel-plant-agreement-nmdc

తాడేపల్లి: కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు. ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రీడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి. మధుసూదన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు. కాగా తాజా అంగీకారంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కళ సాకారం కానుంది అన్నారు. మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో 3వేల ఎకరాలను స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తూ కడప జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ప్రతిపాదనలు పంపారు. సున్నపురాళ్ల పల్లె, పెద్ద వండ్లూర్‌ పరిధిలో సుమారు 3148.68ఎకరాల భూమి కేటాయించాలని కలెక్టర్‌ ప్రతిపాదించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/