తెలంగాణలో బీజేపీ అధికారంలోకొచ్చినా ఆశ్చర్యం లేదు

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu

Hyderabad: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదన్నారు మోత్కుపల్లి నరసింహులు. ఈరోజు ఉదయమే బీజేపీ నేతలు అయనతో కలిసి పార్టీలో చేరేందుకు ఆహ్వానం పలకగా అందుకు మోత్కుపల్లి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు అయన మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ చేరేందుకు తేదీని ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో తెరాస పార్టీ ప్రత్యామ్నాయంగా మరో పార్టీ లేదని, బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఎదగనుందని వెల్లడించారు. దేశం కోసం బీజేపీ ఏంచేయడానికైనా సిద్ధంగా ఉందని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయిందన్నారు.