బిజెపిలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

అమిత్ షాతో భేటీ అయిన మోత్కుపల్లి

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu

న్యూఢిల్లీ: టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరారు. బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నడ్డా ఆయనకు కండువా కప్పి బిజెపిలోకి స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన తెలంగాణ బిజెపి చీఫ్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి బిజెపి అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో చర్చించిన పిదప బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీకి దూరం అయ్యాక మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకే చంద్రబాబుపై విరుచుకుపడి మరీ వ్యాఖ్యలు చేసినట్టు అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/