కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్‌ ఓరా

rahul, Motilal Vora
rahul, Motilal Vora

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా కొద్ది సేపటి క్రితమే ప్రకటించడంతో పార్టీ అధిష్ఠానంకాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడుగా సీనియర్ నేత మోతీలాల్ ఓరాను నియమిస్తు తాజా నిర్ణయం తీసుకుంది. మోతీలాల్ ఓరా గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, రాహుల్ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, తాను ఇప్పటికే అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, సీడబ్ల్యూసీ వెంటనే సమావేశమై కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలని అన్నారు. దీనికితోడు, తన రాజీనామా నిర్ణయానికి కారణాలపై ఒక లేఖను కూడా విడుదల చేశారు. మోతీలాల్ ఓరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/