బండి సంజయ్ కి మోత్కుపల్లి వార్నింగ్..

రీసెంట్ గా తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. గత రెండు రోజులుగా బండి సంజయ్ vs కేసీఆర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా ఎక్కడ తగ్గకుండా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోత్కుపల్లి ..బండి సంజయ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని ఎద్దేవా చేశారు. దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని ప్రశ్నించారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని మోత్కుపల్లి నిలదీశారు. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పిచ్చి వెధవ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దళితబంధు ఇస్తానని అంటుంటే వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలని హితవు పలికారు. నా అనుభవంలో చాలామంది సిఎంలను చూసానన్న మోత్కుపల్లి.. కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నానని చెప్పారు. దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారని హెచ్చరించారు.