నిస్సహాయులకే థెరిసా అంకితం

mother therisafff
Mother Therisa

నేడు మదర్‌థెరెసా జయంతి

నిస్సహాయులకే థెరిసా అంకితం

‘నిర్మలమైన మనసే దేవ్ఞడిని చూస్తుంది అన్న ప్రభువ్ఞ మాటల్ని మదర్‌థెరెసా తన జీవితంలో చేసి, చూపించి, కోట్లాదిమందికి ఆదర్శమహిళగా నిలిచారు. ‘జీవితం ఒక అవకాశం దాన్ని ఒక గొప్పలక్ష్యం కోసం వినియోగించు, జీవితం అందమై నది దాన్ని ఒప్పుకో, జీవితం ఒక కల దాన్ని నిజం చేసుకో, జీవితం ఒక వృత్తి దాన్ని పూర్తిచేయి, జీవితం ఒక ఆట సంపూ ర్ణంగా ఆడు, జీవితం ఒక ప్రమాణం దాన్ని నెరవేర్చు, జీవితం దుఃఖమయం అయినా దాన్ని జయించు, జీవితం ఒక పాట దాన్ని మనసారా పాడు, జీవితం ఒక పోరాటం దాన్ని అంగీకరించు, జీవితం ఒక విషాదం దాన్ని అధిగమించు, జీవితం ఒక సాహసం ధైర్యంగా దాన్ని ఎదుర్కో, జీవితం ఒక అదృష్టం దాన్ని వరించుకో, జీవితం అమూల్యమైనది దాన్ని పాడుచేసుకోకు, జీవితమే ఓ జీవనం దానికోసం నిరంతరం పోరాడు అంటూ నిర్భాగ్యుల జీవితంలో వెలుగును నింపేందుకు దేశంకాని దేశానికి వచ్చి, చనిపోయేంత వరకూ తన మాటల్ని నెరవేర్చుకుని, నేటికీ అనేకుల మనసును దోచుకుంటున్న ప్రేమమూర్తి, అమృతవాణి మదర్‌థెరెసా. బాల్యంలోనే వికసించిన సేవ మదర్‌థెరెసా 1910 ఆగస్టు 26వతేదీన అల్బేనియాలోని స్కోప్‌జీ (ప్రస్తుతం ఇది మెకడోనియా రాజధానిలో ఉంది)లో జన్మించారు. మదర్‌ ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఈమె తల్లి రోమన్‌క్యాథలిక్‌ విధానంలో మదర్‌ను పెంచారు.

కొంతమంది మిషనరీలు బెంగాల్‌లో పనిచేస్తున్న విషయాన్ని థెరెసా తన చర్చిలోని పాస్టర్ల కథల ద్వారా విని, ఆమె నన్‌గా మారి, తన 18వ సంవత్సరంలో మిషనరీగా భారతదేశానికి వచ్చారు. అంతే ఆమెలో సేవాభావం ఒక కెరటంలా మనసులో ఎగసిపడింది. ఇదే సమయంలో ఆమె ఒకసారి కొల్‌కతా నుంచి డార్జిలింగ్‌కు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువ్ఞ ఆమెతో మాట్లాడసాగాడు. ఆయన స్వరాన్ని విన్న థెరెసా దానికి విధేయులై, సేవ కోసం భారత్‌లోనే స్థిరపడ్డారు. 1946వ సంవత్సరంలో సిస్టర్‌ థెరెసా కాస్త మదర్‌థెరెసాగా మారిపోయారు. సేవాకార్యక్రమాలుఆమె 1948వ సంవత్సరం నుంచి మిషనరీ పనిలో నిమగ్నమయ్యారు. మొదట కేవలం కొద్దికాలం నివాసం ఉండేందుకు భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. పేదల్లో నిరుపేదల్ని ఆమె ఎంపిక చేసుకుని, వారి పోషణభారాన్ని స్వీకరించారు. ఇలా వీరికి సేవ చేయడం ఆరంభించారు.

అతికొద్దికాలంలోనే ఈమె సేవాకార్యక్రమాలు మనదేశంలో ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో మనదేశం ఆమెను భారతీయమహిళగా భావించి, శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చింది. పేదల్ని పోషించేందుకు థెరెసా ఆరంభదినాల్లో ఆహారాన్ని, ఇతర వస్తువ్ఞల్ని దాతలను నుంచి అడుక్కోవాల్సి వచ్చేదని ఆమె తన డైరీలో రాసుకున్నారు. దీంతో థెరెసా ‘ఇది దేవ్ఞడు నాకు ఇచ్చిన సేవ కాదు, ఒకవేళ దేవ్ఞడే ఈ పరిచర్యను నాకు ఇస్తే, ఇతరులను అడుక్కునే పరిస్థితికి వచ్చేదాన్ని కాదు అనుకుని ఆ సేవకు గుడ్‌బై చెప్పాలనుకున్నారు. కానీ దేవ్ఞడు నన్ను విడిచిపెట్టలేదు. నేను వెనక్కి వెళ్లాలనుకున్నాను. ఆ వైఫల్యమే దేవ్ఞడు నాకు విజయంగా మార్చాడు. ప్రభువ్ఞపై ఆధారపడే అనుభవాన్ని నాకు ఇచ్చాడు అంటారామె. 1950వ సంవత్సరం అక్టోబర్‌ 7న కేవలం 13మందితో ఆరంభమైన మదర్‌ సేవ, నేటికి నాలుగువేలమందికి పైగా సిస్టర్లు అనాథుల సేవలో తరిస్తున్నారంటే ఈ సంఖ్య ఎంతో ఊహించవచ్చు. కష్టాల కడలిలో… ‘నిర్మలమైన మనసు స్వేచ్ఛా మనసే, శాంతి ఒక చిరునవ్ఞ్వకు చిహ్నం అంటూ తన డైరీలో రాసుకున్న థెరెసా ఆ శాంతి కోపం చనిపోయేంత వరకూ పోరాడారు.

అనాథలకు ఆమె ఒక దేవత, తాగుబోతులకు ఆమె చేయి ఓ వెచ్చటి ఆప్యాయత స్పర్శ. కోల్‌కతాలో మదర్‌ సేవను అపార్థం చేసుకున్న ఒక తెగ ప్రజలు ఈమె మన సంస్కృతిని పాడుచేస్తున్నదని ఒక గూండాను మదర్‌పై దాడిచేసేందుకు పంపించారు. ఆమెపై దాడిచేసేందుకు మదర్‌ ఉన్న ఆశ్రమం తలుపువద్దకు వచ్చిన ఆ గూండా ఆ సమయంలో మదర్‌ తప్పతాగిన ఒక వ్యక్తి వాంతి చేసుకుంటుండగా, ఆమె తన చేతులతో ఆ వాంతిని పట్టుకుని, శుభ్రం చేస్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ఆమెలో ఒక అద్వితీయశక్తిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె కాళ్లపై పడి క్షమించమని అడిగాడు.

పేదలంటే ఎందుకింత ప్రేమ!: మదర్‌ థెరెసాకు పేదలంటే ఎందుకింత అభిమానమని గమనిస్తే ఆమెలో రగిలే భావాలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఆమె మనసు ఎప్పుడూ పేదలపైనే తిరుగుతుండేవి. ‘ఈ విశ్వంలో ప్రేమకోసం తపించే వారెంతో మంది ఉన్నారు. బాధ, ఒంటరితనం, పేదరికం, ఆదరణ లేకపోవడం, తిరస్కారం, వెలివేయబడ్డతనం వంటి వీటిని మనం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటాం. మనలాగా బాధపడేవారిపై మనకున్న భారం ఏంటి? అని ప్రశ్నించుకుని, ఆ దిశగా వారికి సేవ చేసేందుకు ఆమె ముందుకు వచ్చారు. పరిశీలిస్తే తెలుస్తుంది. ‘నువ్వెప్పుడు మౌనంగా ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడెప్పుడు నీతో మాట్లాడుతాడో వెంటనే ఆయన చెప్పిన పని నీవు చేస్తావు అనే మాటను థెరెసా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చాలామంది మదర్‌థెరెసా అనగానే ఆమెను ఒక సామాజిక సేవకురాలిగా మాత్రమే చూస్తారు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండవవైపు ఆమె పూర్తిగా ప్రభువుకు విధేయురాలైన శిష్యురాలు. మదర్‌థెరెసా యేసుక్రీస్తును ప్రేమించకపోయి ఉంటే ఆమె ‘నన్‌గా మారి ఉండేవారు కారు. నన్‌గా మారిన ఆమె మొదట మిషనరీ తరపున భారతదేశానికి వచ్చారు. సామాజిక సేవ కోసం ఈ దేశానికి రాలేదు కానీ, ఆధ్యాత్మిక చింతనతో నిండిన భావంతో వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లో నిరుపేదలు, ఏ ఆదరణ లేక బాధపడుతున్నవారిని ప్రత్యక్షంగా చూసిన థెరెసా చలించిపోయారు.

తిరిగి ఆమె తన స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ భారత్‌లో ఆమె చూసిన దృశ్యాలు వెంటాడే జ్ఞాపకాలుగా ఆమెను నిలువనివ్వలేదు. ఇదే సమయంలో ప్రభువు ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాడు. అందరు ఆడపిల్లల్లా ఉద్యోగం, వివాహం, పిల్లలు వంటి ఆలోచనలతో థెరెసా ఉందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ థెరెసా వీటిని సున్నితంగా తిరస్కరించి, మళ్లీ మిషనరీ తరపున కొల్‌కతాకు వచ్చారు. సేవను ప్రభావితం చేసిన కొన్ని అంశాలు థెరెసా గొప్పగొప్ప ప్రసంగాలతో, ఆవేశంతో, అందరిని ఆకట్టుకునేలా ఎప్పుడూ ప్రవర్తించేవారు కారు. చిన్నచిన్న మాటలతో, పదాలతో కోట్లాదిమందిని ఆకట్టుకోగల్గారు. ఏ పనిలోనైనా విజయాన్ని సాధించాలంటే అందుకు ‘నమ్మకం, లేదా విశ్వాసం ఉండాలనేది థెరెసా నమ్మిన సిద్ధాంతం. సేవ చేయాలంటే ఏదో త్యాగం చేసినట్లుగా కాదని, అదెంతో విలువైనదిగా ఉండాలంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలని థెరెసా చెబుతుంటారు. ‘ఫలించే ప్రార్థన మౌనంగా ఉంటుంది, ఫలించే ఆ ప్రార్థన నమ్మకంతో ఉంటుంది,

ఆ నమ్మకం ప్రేమతో నిండి ఉంటుంది, ఆ ప్రేమ సేవ చేసేందుకు ప్రేరేపిస్తుంది, ఆ సేవ ప్రశాంతతను ఇస్తుంది థెరెసా చెప్పిన ఈ మాట విశ్వఖ్యాతి చెందింది. మీకు ఉండే తక్కువ డబ్బులో కొంత భాగం ఆకలితో అలమటించేవారికి ఇస్తే మీరెంతో సంతోషంగా ఉండగలరని థెరెసా బోధిస్తుంటారు. నేడు ఆమె మనమధ్య లేకపోయినా ఆమె వదిలి వెళ్లిన సేవ కొనసాగుతూనే ఉంది. ్పు ====