కన్న కొడుకుని కడతేర్చిన కసాయి తల్లి

Mother killed her son
Mother killed her son

రంగారెడ్డి: కన్నతల్లే కొడుకు పాలిట మృత్యువుగా మారింది. 20 ఏళ్లు కష్టపడి సాకిన తల్లి తన కొడకు హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పల్లెతండాకు చెందిన ఇస్లావత్‌ హరిలాల్‌ ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. అతడి తల్లి చాంది పలుమార్లు ఏదో ఒక పని చేసుకొమ్మని చెప్పింది. అయినా అతడు వినలేదు, దీంతో ఇక చంపేస్తేనే మంచిదని తలచింది ఆ తల్లి. అంతే ఇంట్లో గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. కొడుకు శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా తండా శివార్లలో కంపచెట్లల్లో పడవేసింది. అంతేకాకుండా తన కొడుకు మతిస్థిమితం సరిగా లేదని, వేళకు సరిగా తినడు. కొద్ది రోజులుగా ఇంట్లోంచి బయటకు వెళ్లిన అతడు చనిపోయాడేమో అంటూ ఊరిని నమ్మించడం మెదలు పెట్టింది. కాగా తండా శివార్లలో లభించిన అతడి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించగా అది హత్యగా తేలింది. దీంతో పోలీసులు కాస్త గట్టిగా తల్లిని విచారించగా తన నేరాన్ని అంగీకరించింది. దీంతో నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈమెకు ఎవరైనా సహాయం చేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/